టీమిండియా కొత్త జెర్సీ ఇదే... వీడియో చూపిన బీసీసీఐ!

  • 142  ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలిసారి
  • జెర్సీలపై పేర్లు నంబర్లు
  • ట్విట్టర్ లో వీడియో
భారత క్రికెట్ జట్టు ఆటగాళ్ల జెర్సీ మారింది. ప్రస్తుతం జట్టు వెస్టిండీస్ పర్యటనలో ఉండగా, విండీస్ ఏ జట్టుతో భారత జట్టు మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ లో ఆడింది. ఇప్పటికే టీ-20, వన్డే సిరీస్ లను సొంతం చేసుకున్న జట్టు, టెస్టుల్లోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న వేళ, నూతన మార్గదర్శకాలను అనుసరించి, 142 ఏళ్ల టెస్టు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్ల జెర్సీలపై వారి వారి పేర్లు, నంబర్లకు అనుమతిచ్చింది.

ఇటీవలి ఇంగ్లాండ్‌ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన యాషెస్‌ సిరీస్ నుంచి ఈ మార్పు అమలులోకి రాగా, భారత జట్టు తొలిసారిగా కొత్త డ్రస్ లతో కనిపించింది. ఇక నిన్న ప్రారంభమైన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ కొత్త జెర్సీలతో మైదానంలోకి అడుగుపెడుతున్న వీడియోను బీసీసీఐ ట్విటర్‌ లో పోస్టు చేసింది.
Go Back to Shorts
India
BCCI
Cricket
Jersy

More Telugu News